పవర్ స్టార్ తో జతకడుతున్న అక్కినేని సమంత ?

by సూర్య | Thu, Jun 10, 2021, 01:11 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయనున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తోన్న పవన్ వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ  సినిమా తరువాత సమంత .. పవన్ కల్యాణ్ కు జోడీగా ఒక సినిమా చేయనుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. గతంలో పవన్ - సమంత కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా ప్రాజెక్టు విషయంపై అధికారిక ప్రకటన వస్తే ఫ్యాన్స్ ఇక ఖుషీ కావొచ్చు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM