పాయల్ రాజపుత్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ !

by సూర్య | Thu, Jun 10, 2021, 11:40 AM

తెలుగు బిగ్ బాస్-5కు వచ్చిన క్రేజ్ తో ఐదో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐదో సీజన్ మొదలవ్వాల్సింది కానీ కరోనా కారణంగా ఆడిషన్స్ ఆలస్యం అయ్యాయి. అయితే ప్రస్తుతం మేకర్స్ కంటెస్టెంట్ లను జూమ్ వీడియో కాల్ ద్వారాయా మాట్లాడుతూ సంప్రదింపులు జరుపుతున్నారట.టాలీవుడ్ లో ప్రస్తుతం పేరున్న సెలబ్రీటీస్ లో పలువురు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ లిస్ట్ లో టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా ఉందట. నిజంగా అలా కానీ జరిగితే.. బిగ్ బాస్ 5 షో పాయల్ రాజ్ పుత్ వల్ల బ్రహ్మాండమైన టీఆర్పీ తెచ్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఒక్కరి వల్ల షో కు ప్రజాదరణ ఓ రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరి నిజంగానే పాయల్ బిగ్ బాస్ 5 లో పార్టిసిపేట్ చేస్తుందో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM