బాలయ్య బర్త్ డే సందర్భంగా అభిమానులకు 'గిఫ్ట్'

by సూర్య | Thu, Jun 10, 2021, 10:48 AM

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు 'గిఫ్ట్' వచ్చేసింది. గోపీచంద్ మలిలేని దర్శకత్వంలో బాలయ్య ప్రధాన పాత్రలో 107వ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజా లుక్‌ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'హంట్ స్టార్ట్స్ సూన్' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో దూసుకుపోతోంది. బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ' సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM