మరోసారి ఆ స్టార్ హీరో సరసన కాజల్

by సూర్య | Thu, Jun 10, 2021, 10:31 AM

కాజల్ అగర్వాల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చందమామ సినిమాతో హిట్ కొట్టింది. ఈ మూవీ తర్వాత కాజల్‏కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే ఈ ముద్దు గుమ్మ టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. ఇటు టాలీవుడ్‏లోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్‏లోని బడా హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. అయితే ఇటీవల గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడు ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కలయికలో వస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‏గా నటిస్తుంది. శరవేగంగా జరుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా వైరస్ కారణాంగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. కాజల్‏కు మరో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.


కాజల్ అగర్వాల్.. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‏కు జోడీగా సింగం సినిమాలో నటించింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్‌-కాజల్‌ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తమిళంలో కార్తీ ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ఖైదీ. ఈ సినిమాను హిందీలో రిమేక్ చేయబోతున్నారట. ఈ మూవీ రీమేక్ హక్కులు దక్కించుకున్న అజయ్ దేవగణ్ త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజయ్ కు జోడీగా కాజల్ నటించబోతున్నట్లుగా టాక్. అయితే ఒరిజినల్ ఖైదీలో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు.కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కాజల్ క్యారెక్టర్ పై అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Latest News
 
'కుబేర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Mar 28, 2024, 07:25 PM
'టాక్సిక్' లో య‌ష్ సోదరిగా స్టార్ హీరోయిన్? Thu, Mar 28, 2024, 07:19 PM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM