గర్భవతైన లోక్ సభ ఎంపీ.. నాకు సంబంధం లేదంటోన్న భర్త

by సూర్య | Wed, Jun 09, 2021, 02:07 PM

 గర్భవతైన లోక్ సభ ఎంపీ.. ఆరు నెలలుగా కలిసి ఉండట్లేదు.. నాకు సంబంధం లేదంటోన్న భర్త.నుస్రత్ జహాన్.. బెంగాళిలో పాపులర్ నటి. అంతేకాదు ఆమె పార్లమెంటు సభ్యురాలు కూడా. లోకసభ ఎంపీగా ఉన్న నుస్రత్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అది అలా ఉంటే నుస్రత్ 6 నెలల గర్భవతి అని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆమె భర్త నిఖిల్ జైన్‌కు తెలియక పోవడం హాట్ టాపిక్‌గా మారింది. నుస్రత్, నిఖిల్‌ల మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజులుగా వేరు వేరుగా నివసిస్తున్నారు. అంతేకాదు ఈ జంట విడాకుల తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.


నుస్రత్ జహాన్ గర్భవతి అని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కానీ నుస్రత్ ఈ వార్తను ధృవీకరించలేదు. మరోవైపు నిఖిల్ గత 6 నెలలుగా నుస్రత్‌తో కలిసి జీవించడంలేదు. ఈ సందర్భంగా నిఖిల్ జైన్ మాట్లాడుతూ.. నుస్రత్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు సంబంధం లేదని పేర్కోనడం వైరల్‌గా మారింది.ఇక గత కొన్ని రోజులుగా నుస్రత్ జహాన్ బెంగాలీ నటుడు, బిజెపి నాయకుడు యశ్ దాస్‌గుప్తాతో రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ ఇద్దరు నూతన సంవత్సర వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లినట్లు అప్పట్లో టాక్ కూడ నడిచింది. నుస్రత్ జహాన్ తన ప్రియుడు నిఖిల్ జైన్‌తో జూన్ 19, 2019 న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం హిందూ ఇంకా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరిగింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM