సమంత యాక్టింగ్ కు ఫిదా రకుల్ ప్రీత్ సింగ్ !

by సూర్య | Wed, Jun 09, 2021, 12:56 PM

సమంత తాజా వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ చూసిన వారు సమంత ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గ్లామర్ హీరోయిన్ అయ్యుండి.. ఇలా డీ గ్లామర్ రోల్ లో, గట్స్ ఉన్న రోల్ లో యాక్షన్ తో ఇరగదీసిన సమంత ఫ్యామిలీ మ్యాన్ రాజి పెరఫార్మెన్స్ ని తెగ పొగిడేస్తున్నారు.ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.మొదటి సీజన్ కంటే ప్రస్తుతం సీజన్2 లో భాగంగా వచ్చిన కంటెంట్ అద్బుతంగా ఉందనే స్పందన డిజిటల్ ఆడియన్స్ నుంచి వస్తుంది.ఇక సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.అలాగే సమాజంలో ఎంతో మంది క్రురత్వానికి బలై టెర్రరిస్ట్ గా మారిన అమ్మాయిగా సమంత పాత్రకి కూడా విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.మొదటి సారి పూర్తి స్థాయిలో సమంత డీగ్లామర్ పాత్రలో ఈ వెబ్ సిరీస్ లో కనిపించింది.టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చూసి ప్రసంశలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇప్పుడు సమంతా పెర్ఫార్మెన్స్ ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేసింది.ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ మా ఫ్యామిలీతో కలిసి చూశానని ఇందులో మనోజ్ బాజ్ పాయ్ పాత్ర, అతని నటన అద్బుతంగా ఉందని రకుల్ పేర్కొంది.ఇక సమంత అయితే నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ తో టెక్ ఏ బౌ అనే విధంగా ఆధారగొట్టిందని పొగడ్తలు కురిపించింది.


ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం దర్శకులు రాజ్ అండ్ డీకేకి పెద్ద ఫాన్స్ గా మారిపోయామని పేర్కొంది.మొత్తానికి ఒక స్టార్ హీరోయిన్ గురించి మరో స్టార్ హీరోయిన్ ఈ రేంజ్ లో పొగిడింది అంటే సమంతా ది ఫ్యామిలీ మెన్ 2లో ఏ స్థాయిలో నటించిందో చెప్పొచ్చు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM