వెబ్ సిరీస్ పై తమన్నా కన్ను ?

by సూర్య | Wed, Jun 09, 2021, 11:33 AM

అవును.. మీరు వింటున్నది నిజమే.. !  తాజాగా వెబ్ సిరీస్ లపై తమన్నా కన్ను పడింది. కరోనా తెచ్చిన కాలమే ఇది కావొచ్చేమే అంటున్నారంతా.  స్టార్ హీరోయిన్స్ కి ఓటీటీ ప్లాట్ ఫాం వచ్చినప్పటి నుంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నటీ, నటులకి  ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా  పెద్ద ఊరట దొరికినట్లయింది.  సినిమాలలో చేయడానికి ఉండే కొన్ని పరిమితులను ఓటీటీలో దాటేయొచ్చు. అక్కడ సెన్సార్ ఉంటుంది. ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. చేసినా సెన్సార్ లో ఉంటుందో కట్ అవుతుందో చెప్పలేము. అదే ఓటీటీలో అయితే ఎంతైనా చేయొచ్చు.మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల నటించిన 'నవంబర్ స్టోరీస్' వెబ్ సీరీస్ కి మంచి ఆదరణ లభించడంతో ఈ చిన్నది ఇక ఓటీటీ కంటెంట్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. పారితోషికం పరంగా కూడా ఈ వెబ్ సీరీస్ ఆకర్షణీయంగా ఉండడంతో మరిన్ని సీరీస్ లో నటించడానికి ఆమె నిర్ణయించుకుందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొన్ని వెబ్ సీరీస్ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM