మారుతి సినిమా లో మెహ్రీన్

by సూర్య | Wed, Jun 09, 2021, 10:27 AM

దర్శకుడు మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో 'పక్కా కమర్షియల్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. అయితే మారుతి సైలెంట్ గా మరో చిన్న సినిమా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఓ స్క్రిప్ట్ రాసుకున్న మారుతి ఇప్పుడు దాన్ని సినిమాగా మలుస్తున్నాడట. ఇటీవల 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ హీరోగా మారుతి సినిమాను తెరకెక్కిస్తున్నాడు.


ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించకుండా అతడి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కనిపించబోతుందని సమాచారం. నిజానికి మెహ్రీన్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఎఫ్ 3' సినిమా మాత్రమే ఉంది. అందుకే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది.దీంతో మెహ్రీన్ మరోసారి నటిగా బిజీ అవ్వాలనుకుంటుంది. .ఈ క్రమంలో మారుతి సినిమా ఆఫర్ రాగానే అంగీకరించిందట. సంతోష్ శోభన్ లాంటి కుర్ర హీరోతో మెహ్రీన్ రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. నిజానికి సంతోష్.. మెహ్రీన్ కంటే వయసులో చిన్నవాడు. మరి ఆన్ స్క్రీన్ ఈ జంట కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి!

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM