హాట్ బ్యూటీ తొడలను పాదాలకు ముద్దాడిన వర్మ పైత్యం !

by సూర్య | Tue, Jun 08, 2021, 03:32 PM

ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ప్లే బాయ్ అవతారం ఎత్తాడు. వరుసగా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ రోజుల్లో వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. సరికొత్త రొమాంటిక్ బాయ్ లాగా దర్శనమిస్తున్నారు. మొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానాతో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే.ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. రీసెంట్ గా వర్మ, హీరోయిన్ సోనియా తొడ పై ముద్దు పెడుతున్న ఫోటోను వదిలాడు.ఆ ఫోటో బాగా వైరల్ అయింది. ఓ అమ్మాయి పాదాన్ని ముద్దాడుతూ వర్మ ఫోటో దిగాడు. పైగా అర్ధరాత్రి ఒంటిగంటకు తన పైత్యపు స్టిల్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతూనే ఉంది. మొత్తానికి వర్మ కామెంట్స్ ను వదిలేసి, ఫోటోల పై పడ్డాడు. మరి రానున్న రోజుల్లో ఈ దర్శకుడు ఇంకా ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో చూడాలి.గత కొన్ని సంవత్సరాలుగా ఆడియన్స్ బలహీనతలనే క్యాష్ చేసుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్జీవీ, మొత్తానికి బూతు సినిమాలతోనే దర్శకుడిగా నెట్టుకొస్తోన్నాడు. ఏది ఏమైనా తన సినిమాల పరంపరను మాత్రం ఆర్జీవీ అపట్లేదు. ఖాళీగా వున్న ఔత్సాహిక టెక్నీషియన్ల శ్రమను పెట్టుబడిగా పెట్టి, వాళ్ళు చేసే సినిమాలకు తన పేరు వేసుకుంటూ ముందుకు పోతున్నాడు వర్మ.

Latest News
 
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM
'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:02 PM
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM