హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్

by సూర్య | Sun, Jun 06, 2021, 12:41 PM

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక సమస్యలలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా తేలడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచారు. అయితే కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చిన రియా సినిమా ఆఫర్స్ కోసం వెతుకులాటలో ఉంది. మళ్లీ హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్‌లోను ఛాన్స్‌ల కోసం రియా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుండగా, తాజాగా ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 15 కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుండగా, ఆమె తన సర్కిల్స్‌ని ఉపయోగించుకొని ఇందులో ఛాన్స్ సంపాదించిందట. తనపై వచ్చిన అబాండాలని తొలగించుకునేందుకు బిగ్ బాస్ మంచి వేదికగా ఉంటుందని రియా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM