`ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` లో రాజీ పాత్ర గురించి ఓపెనైన సమంత

by సూర్య | Sun, Jun 06, 2021, 11:27 AM

వివాదాలు కొనసాగుతున్నా..దాంతో సంబంధం లేకుండా `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న  సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూసిన థ్రిల్లింగ్ సిరీస్ ఇది. మొదటి భాగం కంటే రెండో భాగం మరింత థ్రిల్ కి గురి చేసిందంటూ అభిమానులు మొదటి రోజే ట్వీట్ రివ్యూలు ఇచ్చారు. సీజన్ 2లో సమంత పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈలం రెబల్ రాజీ పాత్రలో సామ్ అద్భుతంగా నటించారని ప్రశంసలు దక్కాయి. రాజీ కథ ..యుద్ధం తో బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవించే వారికి నివాళి. రాజీ కథ కల్పితమైనప్పటికీ అది ఎంతో సున్నితమైన గొప్ప జ్ఞాపకం అని సామ్ అన్నారు. ఈలం మహిళల డాక్యుమెంటరీలకు కొన్ని వేల వీక్షణలు మాత్రమే ఉన్నాయి. 10వేల మంది ఈలం ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయినప్పుడు ప్రపంచం ఏం చేసిందో తెలిసింది. లక్షలాది మంది తమ జీవనోపాధిని ఇళ్లను కోల్పోయారు. లెక్కలేనంత మంది  దూరప్రాంతాలకు వెళ్లారు. కలహాల గాయాలు వారి హృదయాల్లో  మనస్సులలో ఎప్పటికీ తాజాగా ఉన్నాయి అని సమంత తెలిపారు. 

Latest News
 
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM