యువ దర్శకులను ఆకట్టుకుంటున్న నందమూరి బాలకృష్ణ?

by సూర్య | Sat, Jun 05, 2021, 02:55 PM

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సక్సెస్ లేక దాని కోసం సినీ ఇండస్ట్రీ చకోర పక్షిలా తిరుగుతున్నాడు. మళ్లీ తనకు రెండు హిట్లు ఇచ్చిన ‘బోయపాటి శ్రీను’తో ప్రస్తుతం ‘అఖండ’మూవీ తీస్తున్నారు. ఇక బాలయ్య రాజకీయ ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. సమావేశాలలో ఆయన దూషించడం ఎవరికీ అర్థం కాని పరిస్థితి.అలాంటి ఇమేజ్ ఉన్న బాలయ్య సోషల్ మీడియాలో నెటిజన్లకు.. యూట్యూబ్ స్పూఫ్ సృష్టికర్తలకు ఇష్టమైన వ్యక్తిగా మారాడు. బాలయ్యపై వందల సెటైర్ల మీమ్స్, స్ఫూఫ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.. ఇలా వివాదాస్పదంగా ఉండడం.. ముక్కుమీద కోపంతో బాలయ్యతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు దూరంగా ఉంటున్నారు. యువ దర్శకులు అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాను 'షైన్ స్క్రీన్' బ్యానర్ వారు నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. 'మజిలీ' .. 'టక్ జగదీశ్' సినిమాలను నిర్మించిన ఈ బ్యానర్ .. తొలిసారిగా బాలకృష్ణతో భారీ సినిమాను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 10వ తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ పోస్టర్ రావొచ్చని అంటున్నారు. 'అఖండ' షూటింగు పూర్తికాగానే బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లానున్నాడని అంటున్నారు.  బాలకృష్ణ గారు స్క్రిప్ట్‌ను ఇష్టపడిన తర్వాత దర్శకుడి పనిలో జోక్యం చేసుకోడు. యువ దర్శకులు ఇలాంటి వైఖరిని తారల నుంచి కోరుకుంటారు. రవితేజతో “క్రాక్” తీసి భారీ విజయాన్ని అందించిన గోపిచంద్ మలినేని బాలకృష్ణ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) న అధికారికంగా ప్రకటించబడుతుంది.

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM