యామీ గౌతమ్ ను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ ?

by సూర్య | Sat, Jun 05, 2021, 12:58 PM

లాక్ డౌన్ సమయంలో మరో హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. హీరోయిన్ యామీ గౌతమ్ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను వివాహమాడింది.ఈరోజు అతి తక్కువమంది ఫ్రెండ్స్ - కుటుంబ సభ్యులు - సన్నిహితుల సమక్షంలో యామీ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ ను వివాహం చేసుకుంది.దిత్య బాలీవుడ్ ఇండస్ట్రీకి 'ఉరి' అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే ఆదిత్య ఇండస్ట్రీ పరంగా అందరిని ఇంప్రెస్స్ చేసాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ యామిగౌతమ్ కూడా ఓ కీలక రోల్ ప్లే చేసింది. ఆ సినిమా టైంలోనే వీరిద్దరూ స్నేహితులుగా మారి తరువాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి.. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసేసుకున్నారు. తన పెళ్లి విషయాన్నీ యామి గౌతమ్ స్వయంగా సోషల్ మీడియాలో ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. అలాగే కోవిడ్ నిబంధనల మేరకు తాము కేవలం ఫ్యామిలీ - సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఎలాంటి ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకొని మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాము. మీరందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సడన్ సర్ప్రైజ్ తో బాలీవుడ్ తో టోటల్ దేశవ్యాప్తంగా యామి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM