సత్య దేవ్ , తమన్నా మధ్యలో కెమిస్ట్రీ మూవీ?

by సూర్య | Fri, Jun 04, 2021, 01:02 PM

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఇప్పటి వరకు ఆమె టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితోనూ నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో సత్యదేవ్. ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఒకవైపు సోలో హీరోగా నటిస్తూనే సహాయ నటుడి పాత్రలు కూడా పోషిస్తున్నారు. ప్రతిభావంతుడైన నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు సత్యదేవ్ హీరోగా రాబోతోన్న సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ తెలుగు రీమేక్‌లో సత్యదేవ్, తమన్నా జంటగా కనిపించబోతున్నారు.పేరుకి తగ్గట్టుగానే సినిమా కూడా మంచి రొమాంటిక్ సినిమా. క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ గా నిలిచిన ‘ల‌వ్ మాక్‌టైల్’కు ఇది రీమేక్‌. నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ రొమాంటిక్ క‌థా నేప‌థ్యంలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అయితే ఈ సీన్స్ ను కొంచెం ఘాటుగా తెరకెక్కించాలని, అల చేస్తేనే డిజిటల్ రైట్స్ ను కాస్త పెద్ద మొత్తంలో అమ్ముకోవచ్చు అనేది దర్శకనిర్మాతల అభిప్రాయం.అందుకే, తమన్నాని తీసుకునే ముందే.. బోల్డ్ సీన్స్ గురించి చెప్పి తీసుకున్నారు. సత్యదేవ్ లాంటి అప్ కమింగ్ హీరోతో రొమాన్స్ కాబట్టి, రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వండి అంటూ డిమాండ్ చేసి మరీ, ఈ సినిమాకు గాను రెండు కోట్లు వరకూ పుచ్చుకుందట మిల్కీ బేబీ. క‌రోనా సెకెండ్ వేవ్ తగ్గినా తరువాత త‌మ‌న్నా ఆ రొమాంటిక్ స‌న్నివేశాల‌లో నటించనుంది.ఈ క్రమంలో చిత్ర బృందానికి ఒక కండిషన్ పెట్టింది. ముందుగానే తనతో పాటు సత్యదేవ్ కూడా కరోనా టెస్ట్ చేయించుకుని, పదిహేను రోజులు పాటు సేపరేట్ గా ఉండాలని, అప్పుడే తానూ రోమాన్స్ కి రెడీ అని, అలాగే సత్యదేవ్ లాంటి హీరోతో లిప్ కిస్ చేస్తే తన ఇమేజ్ కి డ్యామేజ్ అని, అందుకే అదనపు రేమ్యునరేషన్ ఇవ్వాలని మళ్ళీ తమన్నా నిర్మాతను కోరిందట. ఘాటు సీన్స్ కాబట్టి నిర్మాత కూడా ఓకే అని అన్నాడని తెలుస్తోంది.

Latest News
 
వన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Tue, Apr 23, 2024, 06:16 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని శంభూ శంభూ వీడియో సాంగ్ రిలీజ్ Tue, Apr 23, 2024, 06:14 PM
1M+ వ్వ్యూ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Tue, Apr 23, 2024, 05:53 PM
'కింగ్‌' లో డాన్‌గా నటించనున్న షారూఖ్? Tue, Apr 23, 2024, 05:47 PM
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్-త్రినాధ రావు నక్కిన చిత్రం Tue, Apr 23, 2024, 05:45 PM