మహేష్ బాబు ఫ్యాన్స్ ను మరో సరి నిరాశ పరిచిన రాజమౌళి ?

by సూర్య | Fri, Jun 04, 2021, 12:42 PM

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న రౌద్రం రణం రుధిరం (ఆర్‌.ఆర్‌.ఆర్‌) చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని సినిమాల్లాగే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌  కూడా వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనున్న ఆర్ఆర్ఆర్ మూవీ  2021 సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాతే రాజమౌళి-మహేష్‌బాబు కాంబోలో సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందనే విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చిందన్న మాట.


 కానీ అవేవీ జరగట్లేదు.  ఎందుకంటే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పనుల నుండి ఇంకా బయటకు రాలేదు.  షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది.  అది పూర్తికావాలంటే ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది.  అది కంప్లీట్ అయినా మహేష్ సినిమా మొదలవుతుందా అంటే అదీ కుదిరేలా లేదు. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉంది. లాక్ డౌన్ మూలన రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. బహుశా ఈ ఎడాది రిలీజ్ ఉండకపోవచ్చు కూడ. ఏది ఏమైనా సినిమా బయటికి వచ్చేవరకు రాజమౌళి వేరే ప్రాజెక్ట్ టచ్ చేసే వీలుండదు.  కాబట్టి మహేష్ బాబు సినిమా ఇప్పుడప్పుడే మొదలుకాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సంవత్సరం వీరి సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఉండదు. సో.. ఇది మహేష్ బాబు అభిమానులకు కొద్దిగా నిరాశపరిచే విషయమే.  

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM