సినీ నటుడు నిఖిల్ కారుకు చలానా విధించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

by సూర్య | Thu, Jun 03, 2021, 12:18 PM

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు ట్రాఫిక్ చలానాలు కూడా కడుతుంటారు. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా టాలీవుడ్ యువహీరో నిఖిల్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులకు చలానా కట్టినట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు లెక్కచేయకుండా రోడ్డు పైకి రావడంతో హీరో కారుకు చలానా విధించినట్లు కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే హీరో రేంజ్ రోవార్ కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడం కారణంగానే తాము చలానా విధించామని మీడియాతో పోలీసులు వివరించారట. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా నిఖిల్ కారు కనిపించింది. వెంటనే పోలీసులు వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా సినీ నటుడు నిఖిల్కు చెందిన కారుగా వివరణ ఇచ్చాడట.సెలబ్రిటీ వాహనంకు నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో పోలీసులు చలనా విధించి అక్కడి నుంచి కారు పంపించివేశారు. ఆ తర్వాత హీరో నిఖిల్ ట్రాఫిక్ పోలీసులతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హీరో కారు విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM