మాజీ భర్తను తేలికగా తీసుకున్నా హీరోయిన్ ?

by సూర్య | Thu, Jun 03, 2021, 12:05 PM

బాలీవుడ్ బ్యూటీ ‘ఆదితి రావు హైదరి’కి ఆల్ రెడీ పెళ్లి అయిందనే విషయమే చాలామందికి తెలియదు. ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎన్నడూ ఎప్పుడూ పెదవి విప్పిన పాపాన పోలేదు ఈ ముదురు భామ. అయితే తనకి పెళ్లి అయిన విషయం బయట పెట్టకపోయినా బాలీవుడ్ మీడియా మాత్రం ఆదితి పెళ్లి గురించి, అలాగే ఆమె తన భర్తతో విడిపోయిన విషయం గురించి ఎప్పుడో పబ్లిక్ చేసింది.యితే ఎప్పుడో గడించిన పోయిన ఈ వ్యవహారం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అదితి పెట్టిన ఒక కామెంట్ కారణంగా మళ్ళీ అదితి పెళ్లి హాట్ టాపిక్ అయింది. అదితి తన ఇన్ స్టాగ్రామ్ ఫోటో పై కామెంట్ చేసింది. ఆ కామెంట్ కాస్త వైరల్ అయింది. ఆదితి, సత్యదీప్ మిశ్రా ఫోటోకి రెస్పొండ్ అవుతూ ‘ఉఫ్…’ అంటూ ఓ కామెంట్ పెట్టింది.ఈ ‘ఉఫ్’కి మీనింగ్ ఏమిటో అదితికే తెలియాలి. ఏది ఏమైనా ఈ కామెంట్ ను నెటిజన్లు తెగ వైరల్ చేశారు. మాజీ భర్త ఫోటోలకు ఆదితి కామెంట్ పోస్ట్ చేసింది అంటూ పలు పత్రికలు కూడా వార్తలు ప్రచురించడంతో మొత్తానికి మరోసారి అదితికి పెళ్లి జరిగిందనే విషయం తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసింది. సత్యదీప్ ని 2009లో పెళ్లి చేసుకుని 2013లో అతనికి దూరం అయిందట.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM