వజ్రాల దొంగ గా కనిపించబోతున్న పవర్ స్టార్ !

by సూర్య | Tue, Jun 01, 2021, 12:11 PM

పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.  క‌రోనా రావ‌డంతో ఆయ‌న కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకొని కోలుకున్నారు. రెండు నెల‌ల పాటు ఆయ‌న‌కు పూర్తి విశ్రాంతి కావాల‌ని వైద్యులు చెప్ప‌డంతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో పలు క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పలు కథనాల ప్రకారం.. వీరమల్లు సినిమాలో పవన్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో 'వీరమల్లు' అనే వజ్రాల దొంగ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. దీంతో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అయితే కథాపరంగా ఆయన మరో రెండు డిఫరెంట్ లుక్స్ లో కూడా కనిపించనున్నాడనే టాక్ కొత్తగా వినిపిస్తోంది. తనని అన్వేషిస్తున్న సైనికుల నుంచి తప్పించుకోవడం కోసం ఆయన గెటప్స్ మారుస్తాడా? లేదంటే అలాంటి సందర్భం మరేదైనా ఉందా? అనేది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిధి అగర్వాల్ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాలో,బాలీవుడ్ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM