సెక్సీ లుక్ లో హన్సిక మోత్వానీ

by సూర్య | Tue, Jun 01, 2021, 12:03 PM

తాజాగా హన్సిక షేర్ చేసిన ఓ ఫోటో షూట్ ఇన్ స్టా లో వైరల్ గా మారింది. దేశముదురు పాప ఇప్పుడు ముదురు పాపే అయినా.. అందులో మాత్రం చాలా క్యూట్ గా దర్శన మిచ్చింది.అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల హన్సిక. అందులోని ఆమె రూప లావణ్యానికి ముగ్ధులైపోయారు కుర్రకారు. తొలి చిత్రంలోనే సన్యాసినిగా నటించడం.. అందులో కూడా గ్లామర్ ను ఒలికించడం జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఈ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదన్నది వాస్తవం. అందుకే ఆ క్యూటీ.. కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ బాగా క్లిక్ అయింది.ప్రస్తుతం హన్సిక .. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. తనకు సంబంధించిన ప్రతీ సందర్భాన్ని వదిలిపెట్టకుండా.. ఫోటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను బాగా పెంచుకుంది. తాజాగా హన్సిక షేర్ చేసిన ఓ ఫోటో షూట్ ఇన్ స్టా లో వైరల్ గా మారింది. దేశముదురు పాప ఇప్పుడు ముదురు పాపే అయినా.. అందులో మాత్రం చాలా క్యూట్ గా దర్శన మిచ్చింది. ఆమె మొదటి సినిమాలో ఏ రేంజ్ లో అందంగా ఉందో ఇప్పుడు కూడా అదే తరహాలో ఆకట్టుకుంటోంది. వన్నె తరగని ఆమె లావణ్యానికి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. దానికి తగ్గట్టుగానే తమ కామెంట్స్ తో ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

Latest News
 
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM
సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 05:26 PM
ప్రేమలు కంటే ప్రేమలు 2 చాలా సరదాగా ఉంటుంది - గిరీష్ ఎడి Sat, Apr 20, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM