బాలకృష్ణ జోడి గా శ్రుతి హాసన్?

by సూర్య | Tue, Jun 01, 2021, 11:42 AM

బాలకృష్ణ తదుపరి సినిమా విషయంలోనూ కథానాయిక సమస్య తలెత్తింది. బాలకృష్ణకి గల ఇమేజ్ వేరు .. ఆయన జోడీగా కొత్త కథానాయికలను తీసుకోలేరు .. క్రేజ్ లేని వారిని తీసుకుని ప్రయోజనం లేదు. అందువలన సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికను వెతికి పట్టుకోవడం దర్శకులకు పెద్ద పరీక్షగా మారింది.ఈ నేపథ్యంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని త్రిషను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. చాలా రోజుల తరువాత తెలుగు నుంచి వెళ్లిన ఆఫర్ కనుక, త్రిష ఓకే అనొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు త్రిషకు మునుపటి క్రేజ్ లేదు. అందువలన శ్రుతి హసన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. గోపీచంద్ నుంచి 'బలుపు' .. 'క్రాక్' వంటి హిట్లు అందుకున్న కారణంగా శ్రుతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. ఈ సినిమాతో శ్రుతి హాసన్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

Latest News
 
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'మిషన్ చాప్టర్ 1' హిందీ వెర్షన్ Tue, Apr 23, 2024, 04:44 PM
10M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వీర ధీర సూరన్' టైటిల్ టీజర్ Tue, Apr 23, 2024, 04:42 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Tue, Apr 23, 2024, 04:40 PM
'హరోమ్ హర' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 23, 2024, 03:56 PM
'కృష్ణ ఫ్రొం బృందావనం' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..! Tue, Apr 23, 2024, 03:52 PM