ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజెస్' ఫస్ట్ లుక్..!

by సూర్య | Tue, Jun 01, 2021, 11:35 AM

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''18 పేజెస్''. 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హీరో నిఖిల్ పుట్టినరోజు (జూన్ 1) సందర్భంగా ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ కు బర్త్ డే విషెస్ అందిస్తూ '18 పేజెస్' ఫస్ట్ లుక్ చాప్టర్ ని విడుదల చేశారు.


ఈ పోస్టర్ ద్వారా సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్.. నందిని పాత్రలో అనుపమ  నటిస్తున్నట్లు తెలిపారు. నిఖిల్ కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఓ కాగితాన్ని ఉంచి.. దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు డిజైన్ చేయబడిన '18 పేజెస్' ఫస్ట్ లుక్ ఎగ్జైటింగ్ గా ఆసక్తికరంగా ఉంది. ''నా పేరు నందిని. నాకు మొబైల్ లో అక్షరాలను టైప్ చేయడం కన్నా ఇలా కాగితం పై రాయడం అంటే ఇష్టం. టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటుంది. కానీ రాసే ప్రతి అక్షరానికి ఓ ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది'' ఆ పేపర్ పై రాసి ఉంది.


'18 పేజెస్' ఫస్ట్ లుక్ చాప్టర్ ని బట్టి చూస్తే సుకుమార్ కలం నుంచి మరో వైవిధ్యమైన కథాంశం వస్తున్నట్లు అర్థం అవుతోంది. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రస్ట్ కలిగించిన మేకర్స్.. ఫస్ట్ లుక్ తో దాన్ని రెట్టింపు చేసారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

Latest News
 
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM
బాలీవుడ్‌లో 'పుష్ప-2' ఆల్ టైమ్ రికార్డ్! Sat, Apr 20, 2024, 03:23 PM
కార్తికేయ కోసం మెగా స్టార్ Sat, Apr 20, 2024, 03:19 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 03:17 PM