అల్లు శిరీష్ కు ఈ సరైన కలిసొస్తుందా?

by సూర్య | Mon, May 31, 2021, 01:18 PM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కు స్టార్ స్టేటస్ మాత్రం రావడం లేదు. తన అన్న అల్లు అర్జున్ స్టార్ గా కొనసాగుతుంటే.. అల్లు శిరీష్ కి మాత్రం ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. మధ్యలో ఒకట్రెండు హిట్లు వచ్చినప్పటికీ.. అవి తన కెరీర్ కు ఎంతమాత్రం కలిసిరాలేదు. అల్లు అరవింద్ కూడా శిరీష్ పై పెద్దగా ఫోకస్ పెడుతున్నట్లు లేదు. ఆయన తలచుకుంటే కొడుకు కోసం సరైన డైరెక్టర్ ని తీసుకొచ్చి హిట్ తీసుకురాగలడు.కానీ మార్కెటింగ్ లెక్కలు అన్నీ చూసుకొని పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేడు. ఆ విషయం పక్కన పెడితే.. ‘విజేత’, ‘జత కలిసే’ అనే రెండు ప్లాప్ సినిమాలను రూపొందించిన రాకేష్ శశి అనే డైరెక్టర్ చేతిలో సినిమా పెట్టడం ఆశ్చర్యంగా మారింది. ఈ సినిమాతో అల్లు శిరీష్ కు బ్రేక్ ఇవ్వడం కంటే.. ఈ సినిమాతో రాకేష్ కు సక్సెస్ కావాలి. నిజానికి ఈ సినిమా రీమేక్ అని తెలుస్తోంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM