కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.!

by సూర్య | Sun, May 30, 2021, 10:04 AM

సోనమ్ బజ్వా.. ఈ పేరు వింటేనే హాట్ బ్యూటీగా మనకు గుర్తొస్తుంది. సోషల్ మీడియాలో ప్రతిసారి హాట్ హాట్ ఫోటోలతో.. అదిరే ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతుంది. ఈ 28ఏళ్ల గ్లామరస్ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన సోనమ్ పూర్తి పేరు సోనమ్ ప్రీత్ బజ్వా. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యనభ్యసించి 2012లో సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో ముంబై చేరింది. ముంబైలో పలు మోడలింగ్ కాంటెస్ట్ లలో కూడా పాల్గొంది. ఎయిర్ హోస్టెస్ నుండి హీరోయిన్ గా మారిన సోనమ్ కొంతకాలంలోనే ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకుంది. కానీ అమ్మడు పూర్తి కెరీర్లో ఎక్కువగా పంజాబీ సినిమాలు చేసింది. అయితే సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'ఆటాడుకుందాం రా' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సోనమ్. ఆ సినిమా హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం అప్పట్లో బాగానే చర్చ జరిగింది.


 ఆ వెంటనే పాండవుల్లో ఒకడు అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అమ్మడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా కూడా ఆడలేదు. కానీ ఆమెకు తెలుగులో సరైన హిట్ పడితే ఎలా ఉండేదో అనే ఆలోచన అయితే అందరిలో కలిగింది. సినీ ఇండస్ట్రీలో అందమైన భామలు ఎంతగా అందాలను ఆరబోస్తే అంతటి ఇమేజ్ వస్తుందని తెలిసిందే. ఇమేజ్ వచ్చిందంటే ఆ వెనకే అవకాశాలు కూడా వస్తాయని నమ్ముతుంటారు. అయితే సినిమా ఆఫర్స్ రాకపోతే ఈ రోజుల్లో కుర్రభామలు ఎంతకైనా తెగించేస్తున్నారు. దాంతో హీరోయిన్ అవకాశాలకు బదులుగా వీళ్లకు ఐటం సాంగ్స్ ఆఫర్స్ వరిస్తున్నాయి. అందుకే వయస్సులో ఉన్నప్పుడే అందాలతో కైపెక్కించాలి.. మంచి ఇమేజ్ దక్కించుకొని.. నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ముందుకెళ్తుంది ఈ ఉత్తరాఖండ్ భామ వయ్యారి. అందుకే వెంకీ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం సినిమాలోని ఐటమ్ సాంగ్ లో ఆడిపాడింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో సోనమ్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM