పవన్ అభిమానులకు గుడ్ న్యూస్!

by సూర్య | Fri, May 28, 2021, 02:12 PM

మలయాళంలో క్రితం ఏడాదిలో విడుదలైన సినిమాలలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన సినిమాగా ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, పవన్ - రానా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు.ఇక మలయాళంలో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఈ సినిమాలో పెడుతున్నారట. పవన్ క్రేజ్ కి తగిన విధంగా ఉండాలనే ఉద్దేశంతో, ఆయన పాత్రకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను క్రియేట్ చేయడం అన్నది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో  చూడాలి.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM