రికార్డు స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్?

by సూర్య | Thu, May 27, 2021, 03:27 PM

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణం రౌద్రం రుధిరం’ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.  అంచనాలకు తగ్గట్టే సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడ జరిగింది.  బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ హెవీ అమౌంట్ చెల్లించి సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.  అయితే హక్కుల్ని కొన్న పెన్ స్టూడియోస్ సంస్థ ఊరికే ఉండలేదు.  తమ వద్దనున్న రైట్స్ థర్డ్ పార్టీలకు విక్రయించింది.  అది కూడ భారీ లాభాలకు.  ఈ థర్డ్ పార్టీలన్నీ పెద్ద పెద్ద సంస్థలే కావడం విశేషం.  తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల డిజిటల్ హక్కులను జీ 5 సంస్థకు, హిందీ డిజిటల్ హక్కులను, విదేశీ భాషలైన ఇంగ్లీష్, పోర్చ్ గీస్, కొరియన్, టర్కిష్ మరియు స్పానిష్ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థకు విక్రయించారు. తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా, హిందీ శాటిలైట్ రైట్స్ జీ సినిమా, తమిళ హక్కులు స్టార్ తమిళం, కన్నడ హక్కులను స్టార్ కన్నడ, మలయాళం హక్కులను ఏషియానెట్ సంస్థలకు అమ్మేశారు.  నార్త్ థియేట్రికల్ రైట్స్ మాత్రం పెన్ స్టూడియోస్ వద్దనే ఉన్నాయి. ఈ విక్రయాల ద్వారా పెన్ స్టూడియోస్ భారీ లాభాలను ఆర్జించింది. ఇక నిర్మాత దానయ్య విషయానికొస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే ఆయన సుమారు రెండున్నర రేట్ల ఆదాయాన్ని సంపాదించారు. 

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM