టాలీవుడ్ హీరోయిన్‌పై నెమలి దాడి

by సూర్య | Mon, Apr 12, 2021, 11:49 AM

మన చుట్టూ ఉండే జంతువులు, పక్షులూ అప్పుడప్పుడూ మనపై దాడి చేస్తుండటం చూస్తూనే ఉంటాం. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండి... సడెన్‌గా ఎటాక్ చేస్తాయి. దాంతో తప్పించుకునే టైమ్ కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈ దాడులు సరదాగా ఉంటాయి... కొన్ని సార్లు ప్రమాదకరంగా మారతాయి. ప్రాణాలపైకి తెస్తాయి. అలాంటి దాడుల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా మరో వీడియో వచ్చింది. అందులో ఓ నెమలి... టాలీవుడ్ హీరోయిన్ దిగంగన సూర్యవంశీపై దాడి చేసింది. ఈ దాడితో మాజీ బిబ్ బాస్ ఫేమ్ బ్యూటీ... అదిరిపడింది. షాకైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది


హిప్పీ, వలయం వంటి తెలుగు సినిమాలతో క్యూట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దిగంగన... నెమలి ముందు కూడా ఎంతో సైలెంట్‌గా ఉంది. అందమైన నెమలి, దాని పించాలను చూస్తూ... ముచ్చటపడింది. కనీసం నెమలిని టచ్ చేయడానికి కూడా సాహసించలేదు. అలాంటిది ఆ నెమలే ఉన్నపళంగా ఎగిరి చేతులపై దాడి చేసింది. నెమలి ఇలా చేస్తుందని ఊహించని దిగంగన... తుళ్లిపడింది. ఈ వీడియోని ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ... తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.


దిగంగన తన జీవితంలో ఎప్పుడూ నెమలిని అంత దగ్గరగా చూడలేదు. ఆ ఉత్సాహంతో ఓ అడుగు ముందుకు వేసింది. అదే సమయంలో నెమలి... ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి... కాళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో ఆమెకు చేతికి చిన్నగా గాయాలయ్యాయి. ఆ వీడియోని మీరూ చూడండి.ఈ ఘటన జరిగినప్పుడు దిగనంగన వెనక కాస్త దూరంలో ఆమె తల్లి ఉన్నారు. దాడి తర్వాత ఆమె వెంటనే దగ్గరకు వచ్చి... దిగంగనకు ధైర్యం చెప్పారు. దాంతో నెమలి దూరంగా వెళ్లిపోయింది. ఈ వీడియోపై యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు రాస్తున్నారు.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM