ఇది నాకు స్పెషల్ బర్త్‌డే: అమ్రిన్ ఖురేషి

by సూర్య | Mon, Apr 12, 2021, 11:13 AM

హైదరాబాద్‌ అమ్మాయ్‌ అమ్రిన్‌ ఖురేషి.. రెండు బాలీవుడ్ భారీ చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'సినిమా చూపిస్తమావ' చిత్రాన్ని 'బ్యాడ్‌బాయ్‌' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ నటుడు వెటరన్ హీరో మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి సరసన హీరోయిన్‌గా అమ్రిన్ నటిస్తోంది. దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాజిద్‌ ఖురేషి నిర్మిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌హిట్‌ మూవీ 'జులాయి' హిందీ రీమేక్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సూపర్‌ డైరెక్టర్‌ టోని డిసౌజా తెరకెక్కించనున్నారు. ఏప్రిల్‌ 11 ఈ హైదరాబాదీ బ్యూటి పుట్టినరోజు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''హీరోయిన్‌గా జరుపుకుంటోన్న ఈ ఫస్ట్ బర్త్‌డే నాకు చాలా స్పెషల్‌. ఇటీవల అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో వేసిన భారీ సెట్లో బ్యాడ్‌బాయ్ సాంగ్ షూట్ చేశాం. ఒక సాంగ్ మినహా మిగతా షూటింగ్ పూర్తయ్యింది. అలాగే త్వరలో 'జులాయి' మూవీ షూటింగ్ ప్రారంభంకాబోతుంది. హైదరాబాద్ అమ్మాయిగా బాలీవుడ్‌లో బిజీ అవడం చాలా సంతోషంగా ఉంది. సౌత్‌లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం డిస్కర్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాను. తప్పకుండా ఇది నాకు బెస్ట్ ఇయర్ అవుతుందని ఆశిస్తున్నాను" అని తెలిపింది.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM