ఆ సీనియర్ నటుడి పరిస్థితి విషమం...!

by సూర్య | Mon, Apr 12, 2021, 08:39 AM

 తెలుగులోనూ చాలా సినిమాలు చేసాడు. సీతాకోకచిలక లాంటి సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం రేపాడు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు కార్తీక్. ఈ మధ్యే తీవ్ర అనారోగ్యంతో బాధ పడిన కార్తీక్.. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి కోలుకున్నాడు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన తర్వాత కూడా ఈయన మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. దాంతో అక్కడ మళ్లీ ఆయనకు అనారోగ్యం తిరగబెట్టింది. ఈ మధ్యే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడిఎంకే పార్టీకి ప్రచారం కూడా చేసాడు. ఇదిలా ఉంటే నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చాడు కార్తీక్. సొంతంగా పార్టీ కూడా పెట్టాడు. కానీ అనారోగ్య కారణాలతో ఆ పార్టీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు కార్తీక్. తాజాగా కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది.. ఈయనకు బీపీ కూడా ఎక్కువైనట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఈయన హాస్పిటల్‌లోనే ఉన్నాడు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM