మ‌ళ్లీ థియేట‌ర్లు బంద్?

by సూర్య | Mon, Apr 12, 2021, 07:53 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు ఒక్కో రాష్ట్రంలో 3,500 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మళ్లీ థియేటర్లు బంద్ అవుతాయని లేదా కచ్చితంగా 50% ఆక్యుపెన్సీ నిబంధన వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను అమల్లోకి తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ క్షణమైనా మ‌ళ్లీ థియేట‌ర్లను బంద్ చేయడం లేదా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే సినిమాలు విడుదల చేయడానికి కూడా నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఏప్రిల్ 16న రావాల్సిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. దానికి తోడు పుష్ప, ఆచార్య లాంటి సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సినిమాలను విడుదల చేస్తే 2, 3 వారాల్లోనే కచ్చితంగా ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో నిర్మాతలు తమ సినిమాలను మరికొంతకాలం వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 15 తర్వాత మ‌ళ్లీ థియేట‌ర్ల బంద్ లేదా 50% ఆక్యుపెన్సీ పెడతారని వార్తలు వస్తున్నాయి.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM