చరణ్​తో సినిమాపై స్పందించిన 'గౌతమ్ తిన్ననూరి'

by సూర్య | Sun, Apr 11, 2021, 12:32 PM

మెగా పవర్ స్టార్ రామ్​చరణ్ ప్రస్తుతం​ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' లోను చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ లో ఉండగానే ప్రముఖ దర్శకుడు శంకర్​తో చరణ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ జులైలో ప్రారంభం కానుంది. అయితే గతంలో చరణ్​తో 'జెర్సీ' ఫేం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా తెరకెక్కించనున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై గౌతమ్ స్పందించాడు. నా కొత్త చిత్రం కోసం ఇప్పటివరకు ఏ హీరోను కలవలేదు. ఎవ్వరికీ కథ కూడా చెప్పలేదన్నారు. ప్రస్తుతం తాను హిందీ 'జెర్సీ' చిత్రంపైనే ఫోకస్ చేసినట్లు వెల్లడించారు. కాగా, నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ' మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో నాని పోషించిన అర్జున్ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 5న హిందీ జెర్సీని విడుదల చేయనున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM