బాలకృష్ణ అభిమానులకు 'ఉగాది' రోజు సర్ప్రైజ్

by సూర్య | Sun, Apr 11, 2021, 12:22 PM

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ సినిమాగా బోయపాటి శీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ బాణీలు కడుతున్నారు. ఈ చిత్రంలో బాలయ్య మీకోవర్ సరికొత్తగా ఉంటుంది. అఘోరాగా కనిపిస్తాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. మే 28న విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మోనార్క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రచారం జరుగుతుండగా, ఒరిజినల్ టైటిల్‌ని ఏప్రిల్ 13 మధ్యాహ్నాం 12.33ని.లకు రివీల్ చేయనున్నారట. ఆ రోజు బాలకృష్ణ అభిమానులకు రెండు పండుగలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM