‘బిగ్ బాస్’ ఫేక్ రియాలిటీ షో : ప్రముఖ నటి

by సూర్య | Sat, Apr 10, 2021, 04:22 PM

బిగ్ బాస్ షోకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా.. దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ రియాలిటీ షో. . అయితే.. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ఓ నటి.. ‘బిగ్ బాస్’పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ టీవీ నటి 'కవిత కౌశిక్' లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్-14లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించింది. ఈ సీజన్లో పాల్గొనడం ద్వారా.. తన కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయిందని ఆవేదన వ్యక్తంచేసింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కామెంట్ చేసిన కవిత.. తాజాగా బిగ్ బాస్ అనేది ఒక ఫేక్ షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘బిగ్ బాస్ ద్వారా మీ కెరీర్ పాడైందని నేను భావిస్తున్నాను. మీరు అందులో పాల్గొనకుండా ఉండాల్సింది’ అని ఓ అభిమాని అన్న మాటలకు ఆమె స్పందించారు. ‘ఈ ఫేక్ రియాలిటీ షో ద్వారా నాకు ఒరిగింది ఏమీలేదు అంటూ జవాబిచ్చింది. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ గురించి చూస్తే.. ‘స్టార్ మా’ నిర్వహిస్తున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఐదో సీజన్ కు ఏర్పాట్లు మొదలు పెట్టి చాలా కాలమే అయ్యింది. జూన్లో ప్రారంభించాలని అనుకుంటున్నారు. కొందరు కంటిస్టెంట్లను కూడా ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. మరి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM