'మేజర్' టీజర్ కు ముహూర్తం ఫిక్స్

by సూర్య | Sat, Apr 10, 2021, 12:26 PM

అడవిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు మేకర్స్. 'మేజర్' టీజర్ ను ఏప్రిల్ 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు సినిమా పోస్టర్ ద్వారా ప్రకటించారు. నిన్న ఈ చిత్రం నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 'ఉగ్రవాదులు హోటల్‌లోకి ప్రవేశించారు. ఉగ్రవాదులు ఆమె కోసం వచ్చారు. కానీ.. ఆమె వాళ్లతో ధైర్యంగా పోరాడింది' అంటూ 'మేజర్' మేకర్స్ విడుదల చేసిన శోభిత లుక్ ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్రంలో శోభిత ప్రమోద అనే పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా 'మేజర్' చిత్రాన్ని జూలై 2న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM