చిరు గ్రేటా.. పవన్ గ్రేటా.. శాంతి టాకీస్‌లో ఫ్యాన్స్ మధ్య గొడవ

by సూర్య | Sat, Apr 10, 2021, 10:54 AM

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వకీల్ సాబ్ సినిమా గతంలో ఎన్నడూ లేని హంగామా సృష్టిస్తోంది. మెగా అభిమానులకు పండుగ తెచ్చిన వకీల్ సాబ్, నానా రభసకు కేంద్ర బిందవుగా మారుతోంది. షో లేట్ అయిందని, మూవీ మధ్యలో ఆగిపోయిందని థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. థియేటర్ల రూపురేఖలు మార్చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్లో శుక్రవారం రాత్రి సెకండ్ షో సమయంలో మెగా ఫ్యాన్స్ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. పిడిగిద్దుల వర్షం కురిపించుకున్నారు. అలాగే మద్యం మత్తులో సినిమా ప్రొజెక్టర్ పై వాటర్ బాటిళ్లను విసిరారు. థియేటర్‌లోని సీట్లను చింపివేసారు. అరగంట పాటు యువకుల గొడవతో వకీల్ సాబ్ సినిమాను యాజమాన్యం నిలిపి వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వారిని సముదాయించారు. దాంతో వివాదం సద్దుమణిగింది. 

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM