బర్త్ డే రోజు బన్నీ ఫ్యాన్స్ పై కేసు నమోదు..!

by సూర్య | Fri, Apr 09, 2021, 03:01 PM

నిన్న గురువారం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి బన్నీ ఫ్యాన్స్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.68లోని ఆయన నివాసానికి భారీగా తరలి వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి సమయంలో బాణసంచా కాల్చినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ తో పాటు సంతోష్ అనే అభిమానిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 290 336 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..  ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా గంటకు పైగా బాణసంచా కాల్చడంతో చుట్టుపక్కల వారికి తీవ్ర అసౌకర్యం కలిగింది. దీంతో పలువురు 100కు కాల్ చేసి బాణసంచా శబ్ధం వల్ల ఇబ్బందులకు గురయ్యామని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ మరియు మరో అభిమాని సంతోష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM
బాలీవుడ్ టాప్ స్టార్‌తో హనుమాన్ దర్శకుడి తదుపరి చిత్రం Tue, Apr 16, 2024, 08:15 PM