పవన్ ని ఫాలో అవుతున్న కొడుకు

by సూర్య | Fri, Apr 09, 2021, 12:59 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెద్ద కొడుకు అకీరా నందర్ బర్త్ డే సందర్భంగా గురువారం అతడి తల్లి రేణుదేశాయ్ కొన్ని ఫోటోలు ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేసింది. పంచెకట్టులో పద్దతిగా ఉన్న అకిరాను చూసి పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. తండ్రికి తనయుడు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పవన్ కొంతకాలంగా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నారు. అందుకోసం రెగ్యులర్‌గా ధోతీ, పంచెకట్టులోనే కనిపిస్తున్నారు.  ఇటీవల ఎక్కువ సినిమాలకు ఒప్పుకోవడంతో మళ్లీ జీన్స్ వేస్తున్నారు. షూటింగ్స్ కోసం తప్పుడం లేదు. ఐతే అచ్చం తండ్రిలానే అకిరా కూడా ధోతీలు ధరిస్తున్నాడు. ఏదో ప్రత్యేకమైన రోజుల్లో కాదు.. సాధారణ రోజుల్లో కూడా ధోతీలోనే కనిపిస్తున్నాడు. దీనికి వెనక ఉన్న కారణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది రేణు దేశాయ్. ఇటీవల తిరుమల పర్యటన సందర్భంగా తల్లిని ఓ ప్రశ్న అడిగాడు అకిరా. మహిళలు ఎప్పుడూ చీరకట్టులోనే కనిపిస్తారు. కానీ పురుషులు మాత్రం పండగలు, దేవాలయాలకు వెళ్లినప్పుడు మాత్రమే పంచెకట్టు, ధోతీలో కనిపిస్తారు. కేవలం అలాంటి సమయాల్లోనే వాటిని ధరించాలా? అని అడిగాడు. తనయుడు ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పింది రేణు దేశాయ్. అది మన మైండ్ సెట్‌ మాత్రమే. కంఫర్ట్‌గా ఉంటే ధోతీ కూడా రెగ్యులర్‌గా ధరించవచ్చని, పైగా అది మన సంప్రదాయ వస్త్రధారణ అని  స్పష్టం చేసింది. అప్పటి నుంచీ జీన్స్, షార్ట్స్ కాకుండా ధోతీని ధరిస్తున్నాడు అకిరా నందన్. పవన్ తనయుడిని చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇంత చిన్న వయసులో సంప్రదాయం పట్ల ఎంత గౌరవం .. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM