బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం...!

by సూర్య | Fri, Apr 09, 2021, 12:59 PM

రచయిత, బిగ్‌బాస్ కన్నడ సెలబ్రిటీ చైత్ర కోటూర్ ఆత్మహత్యాయత్నాం చేయడం శాండల్ఉడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. గురువారం రోజు బెంగళూరులోని తన నివాసంలో సూసైడ్ ప్రయత్నం చేసుకోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె ఆత్మహత్యాయత్నం వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. బిగ్‌బాస్‌తో మంచి ప్రేక్షకాదరణను మూటగట్టుకొని రచయితగా రాణిస్తున్న చైత్ర కోటూర్ మార్చి 28 నాగార్జున్ అనే వ్యక్తిని వివాహం చేసుకొన్నది. కర్ణాటక మాండ్యకు చెందిన ఈ సెలబ్రిటీ బెంగళూరులోని ఓ ఆలయంలో నిరాడంబరంగా వివాహం చేసుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి జరిగి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా కాక ముందే చైత్ర ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం షాక్ కు గురి చేసింది. అయితే చైత్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ విషయంపై పెదవి విప్పకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సూసైడ్ ప్రయత్నం తర్వాత హాస్పిటల్‌లో చేరిన చైత్ర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూసైడ్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM