'కర్ణన్' రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

by సూర్య | Wed, Apr 07, 2021, 02:13 PM

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజాచిత్రం 'కర్ణన్' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. నిజానికి ఫిబ్రవరిలోనే కర్ణన్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అయితే మధ్యలో సినిమా కరోనా కారణంగా డిజిటల్ రిలీజ్ కాబోతుందని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఖచ్చితంగా కర్ణన్ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తేల్చిచెప్పేసారు. అప్పుడే సినిమా రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా మరోసారి కన్ఫర్మ్ చేస్తూ.. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని చెప్పేసారు. కర్ణన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే సినిమా పై అంచనాలను కూడా పెంచేసింది. అవార్డు విన్నింగ్ 'పెరియారుమ్ పెరుమాల్' మూవీని తెరకెక్కించిన మారి సెల్వరాజ్ ఈ సినిమాను కూడా రూపొందించాడు. హార్డ్ హిట్టింగ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన కర్ణన్ పోస్టర్ చూస్తే వందలమంది మధ్యలో ధనుష్ మెరుస్తున్న కత్తి పట్టుకొని కూర్చోవడం మనం చూడవచ్చు. ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్నిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM