అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న 'పవర్ ప్లే'

by సూర్య | Wed, Apr 07, 2021, 11:56 AM

యంగ్ హీరో రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ "పవర్ ప్లే". దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే థ్రిల్ చేసింది. అయితే తాజాగా 'పవర్ ప్లే' చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. థ్రిల్ కోరుకునే ప్రేక్షకులను థియేటర్లలో అలరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా అన్ని వర్గాల ఆడియన్స్ వీక్షించవచ్చు. విజయ్ అనే మధ్య తరగతి యువకుడి జీవితం కొందరి వల్ల ఒక్కరాత్రిలోనే తలక్రిందులుగా మారిపోతుంది. అంతేకాదు సమాజం దృష్టిలో అతనొక మోసగాడిగా నిలబడాల్సి వస్తుంది. దీని కారణంగా ఆయన కుటుంబం రోడ్డున పడుతుంది. ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. దీనంతటికీ కారణం ఎవరు? వాళ్లకు, విజయ్ కు మధ్య సంబంధం ఏంటి? ఈ కేసులో ముఖ్యమంత్రి కూతురుకు ఉన్న సంబంధం ఏంటి? అనేవి సినిమాలోని ఆసక్తికర అంశాలు. ఇక ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తో మూవీ లవర్స్ కు దగ్గరైన రాజ్ తరుణ్ 'పవర్ ప్లే'తో తన పంథా మార్చారు. ఈ థ్రిల్లర్ లో సీరియస్ లుక్ తో సరికొత్తగా కన్పించారు. పూర్ణ, మధు నందన్‌, అజయ్‌, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్‌రాజ్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM