యూట్యూబ్ లో ట్రెండింగ్ లో పవన్ తో పాటు భక్తుడి స్పీచ్...!

by సూర్య | Tue, Apr 06, 2021, 05:20 PM

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. పవన్ కల్యాణ్  'వకీల్ సాబ్' కోసం ఆయన అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ వల్ల ఇప్పటికే ఈ చిత్రం భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరి లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ కు మళ్ళీ ఆల్ టైం రికార్డు స్పీచ్ వచ్చింది. ఇక దీనితో పాటుగా ఇప్పుడు ఇదే స్పీచ్ యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తుంది. మరి టాప్ ప్లేస్ లో పవన్ స్పీచ్ ట్రెండింగ్ లో ఉంటే ఆ తర్వాత నెంబర్ 2 స్థానంలో పవన్ కు అపారమైన భక్తుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ ట్రెండ్ అవుతూ వస్తుంది. ఇలా తన బాస్ తో పాటుగా బండ్ల కూడా వైరల్ అవుతున్నాడు. అయితే అంతకు ముందు బండ్ల స్పీచ్ శరవేగంగా నెంబర్ 1 లోకి వచ్చేసింది. తర్వాత పవన్ స్పీచ్ వచ్చి అలా కొనసాగుతుంది. మరి వీరి స్పీచ్ లు ఇంకెంత కాలం ట్రెండ్ అవుతాయో చూడాలి. ఇక వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 9 రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM