మహేష్‏తో జోడి కట్టనున్న కృతీ శెట్టి..

by సూర్య | Tue, Apr 06, 2021, 11:06 AM

 ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైంది కృతీశెట్టి. ఈ మూవీ విడుదలకు ముందే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు, మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినీ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. మొదటి సినిమాకు విడుదలకు ముందే కృతి అకౌంట్లో మరో రెండు సినిమాలు చేరిన సంగతి తెలిసిందే. అవే నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఓ మూవీ చేయబోతున్నంది ఈ చిన్నది. ఇలా ఉంటే… ఇక ఉప్పెన విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. దీంతో బేబమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.


తాజాగా ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన రాబోయే సినిమా కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మహానటి ఫేమ్.. కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత మహేష్ దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్‏లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళీ సినిమా కంటే ముందే మహేష్.. మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి నటించబోతుందట. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇందులో విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్లో వచ్చే చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లుగా టాక్.

Latest News
 
'సికందర్‌' సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా? Fri, Apr 19, 2024, 04:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సర్దార్' Fri, Apr 19, 2024, 04:12 PM
'ప్రతినిధి 2' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 04:10 PM
'టిల్లు స్క్వేర్' నుండి ఓహ్ మై లిల్లీ వీడియో సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 04:05 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'ఆర్టికల్ 370' Fri, Apr 19, 2024, 03:57 PM