డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అరెస్ట్

by సూర్య | Mon, Apr 05, 2021, 11:33 AM

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 'ఎన్సీబీ' అధికారులు అరెస్టు చేసారు. అయితే అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అజాజ్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించారు. అజాన్ ఖాన్‌ను విచారించిన బృందం కరోనా పరీక్షలు చేయించుకోనుంది. మార్చి 30వ తేదీన రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే డ్రగ్స్ పెడ్లర్ ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు ఖాన్ పేరు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక బాలీవుడ్ నటుడికి సంబంధం ఉన్న అంధేరి, లోకండ్‌వాలా ఏరియాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ డ్రగ్స్ కేసులో ఫరూఖ్ బటాటాను కూడా నిన్న 8 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన కుమారుడు షాదాబ్‌ను గత వారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM