అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ అరుపులు..పవన్ ఏమన్నారంటే..!

by సూర్య | Mon, Apr 05, 2021, 11:16 AM

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ అభిమానుల నడుమ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల సందడి మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడొస్తారా అంటూ ఎదురు చూసిన అభిమానులు.. పవన్ కళ్యాణ్ రాగానే ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయారు. ఇక బండ్ల గణేష్ స్పీచ్ ఈవెంట్ కే హైలైట్ అయ్యింది. ఇక ఆఖర్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా.. అభిమానులు 'సీఎం.. సీఎం..'అంటూ అరవడం మొదలైంది. గతంలో ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సీఎం అన్నది జరగాలబ్బా.. మనం కోరుకుంటే వచ్చేది కాదు' అని ఒక్క మాటలో తేల్చి పడేశారు పవన్ కళ్యాణ్. నువ్వు సినిమాలు ఎందుకు చేస్తున్నావు అని చాలామంది నన్ను అడుగుతున్నారు.. మీరు అయితే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు.. పైరవీలు చేసుకోవచ్చు.. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. నేను మాత్రం సినిమాలు చేయకూడదా అని వాళ్లకు సమాధానం చెప్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. తాను అవినీతి చేయకుండా ఉండటానికి సినిమాలు చేస్తున్నానని అన్నారు. కేవలం లక్షలోపు జీతం ఉండే ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నారు.. నాకు ఎప్పుడు పదవి మీద కోరిక లేదు.. ఏదో అయిపోవాలంటే ఆశ అంతకంటే లేదు.. నాకు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దొరికింది.. దాన్ని మించిన పదవి నాకు అవసరం లేదు.. ఇంకా ఎన్నో విషయాలను ఈ ఈవెంట్ లో అరగంట పాటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 'వకీల్ సాబ్'తో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM