ప్రముఖ మలయాళ నటుడు పి. బాలచంద్రన్ మృతి.

by సూర్య | Mon, Apr 05, 2021, 10:39 AM

ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ 62 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ సోమవారం తెల్లవారుజామున మరణించారు. బాలచంద్రన్ కు భార్య శ్రీలత, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, పార్వతి ఉన్నారు. కేరళలోని కొల్లం జిల్లాలోని శాస్తంకోట గ్రామంలో పద్మనాభ పిళ్ళై, సరస్వతి భాయ్ దంపతులకు పద్మనాభన్ బాలచంద్రన్ నాయర్ ఫిబ్రవరి 2, 1952 న జన్మించారు. స్క్రీన్ రైటర్ గా, నటుడుగా పనులు సినిమాలకు పనిచేశారు. బాలచంద్రన్ కళా రంగానికి చేసిన సేవకు గాను కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్నారు. 1989లో వేసిన ‘పావన్ ఉస్మాన్’ నాటకానికి అవార్డులతో పాటు.. అనేక ప్రశంసలను అందుకున్నారు. బాలచంద్రన్ చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో మమ్ముట్టి చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ వన్ లో కనిపించారు . బాలచంద్రన్ మృతికి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పరిశ్రమలోని అభిమానులు, సహచరులు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM