ఆ ఫైర్ ఏంటి బండ్లన్నా..!

by సూర్య | Mon, Apr 05, 2021, 08:59 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ తో అదరగొట్టేశారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై గతంలో కూడా అద్భుతమైన స్పీచ్ లు ఇవ్వగా.. తాజా స్పీచ్ వాటన్నిటినీ దాటి పోయింది. ఇక బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉంటే ఓ వైపు అభిమానులు అరుపులతో హోరెత్తించగా.. పవన్ కళ్యాణ్ నవ్వు ఆపుకోలేకపోయారు.


ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఏడుకొండలవాడికి అన్నమయ్య, శివుడికి భక్తకన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేశ్ అని సగర్వంగా చెప్పుకుంటా అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం అని, ఆయనను వదులుకోవాలన్నా కష్టమేనని అన్నారు. ఏవో మాయ మాటలు చెప్పి పవన్ తో సినిమా చేద్దామని వెళ్లినా ఆయన కళ్లలో నిజాయతీ చూసి వెనక్కి వచ్చేస్తానని వివరించారు. ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ కు పొగరు అని ఓసారి ఎయిర్ పోర్టులో తనతో అన్నాడని, అయితే అతడ్ని కేబీఆర్ పార్కులో పట్టుకుని పవన్ కల్యాణ్ గొప్పదనం వివరించానని అన్నారు. "శత్రుసైన్యాలకు చిక్కినా ఒక్క రహస్యం కూడా బయటికి చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసానికున్నంత పొగరు పవన్ కు ఉందని చెప్పా. సరిహద్దుల్లో చైనా దురాక్రమణలను ఎదుర్కొనడానికి మరఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికున్నంత పొగరుందని చెప్పా. భారతమాత ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకున్నంత పొగరు ఉందని చెప్పా" అంటూ చెప్పుకొచ్చారు. వకీల్ సాబ్ గురించి ఏమి మాట్లాడాలి.. ఆయన బ్లాక్‌బస్టర్లు చూడనివా? ఇండస్ట్రీ హిట్లా? ఆయన చూడని చరిత్రలా? సినిమా తర్వాత సినిమా చేస్తూ 12 వందల సినీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కొత్త చరిత్ర నాంది పలికారు.. అని బండ్ల గణేష్ అన్నారు.


ఈ మధ్య ఒకాయన పవన్ కల్యాణ్ గురించి తప్పుడు కూత కూశాడు. రాజకీయాలంటూ, సినిమాలు అంటూ కామెంట్ చేస్తూ.. మనలాగా కోళ్ల వ్యాపారం, పాల, సారా, విస్కీ, ఇటుక, ఇసుక వ్యాపారం లేవు. ఆయన తన రక్తాన్ని చెమటగా మార్చి తన నటనతో ఎన్నో సినీ కుటుంబాలను ఆదుకొంటారు. ఆయన నమ్ముకొన్నవారికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించిన వ్యక్తిరా లఫూట్ అని అన్నానన్నారు బండ్ల గణేష్. ఇంకా ఆయన స్పీచ్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ దాగుంది. ప్రస్తుతం ఆయన స్పీచ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భీమ్లా నాయక్' Thu, Mar 28, 2024, 02:43 PM
గేమ్ ఛేంజర్ : జరగండి సాంగ్ బడ్జెట్ ఎంతంటే....! Thu, Mar 28, 2024, 02:41 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 02:34 PM
'మనమే' నుండి ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Mar 28, 2024, 02:32 PM
నేడే 'ఫైటర్‌రాజా' టీజర్‌ లాంచ్ Thu, Mar 28, 2024, 02:30 PM