‘పుష్ప’నుంచి మరో సర్‌ప్రైజ్ గ్లిమ్ప్స్

by సూర్య | Sat, Apr 03, 2021, 11:25 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో తొలిసారి కన్నడ బ్యూటీ రష్మిక బన్నీ సరసన నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ లారీ క్లీనర్‌ పాత్రలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్న బన్నీ ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో బన్నీ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో బన్నీ తన స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు. అయితే ఈ సినిమానుంచి అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 8న అల్లుఅర్జున్ పుట్టిన రోజు కానుకగా అభిమానులకు భారీ సర్‌ప్రైజ్  ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీమ్. ఏ నేపథ్యంలో ఈ వారామంతా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ‘పుష్ప’ మేకర్స్ అప్డేట్స్ కోసం రెడీగా ఉండమని ట్వీట్ చేసారు. అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని గ్లిమ్ప్స్ రూపంలో వదిలారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM