by సూర్య | Sat, Apr 03, 2021, 08:57 AM
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ తలైవి. బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్.. జయలలిత పాత్రలో నటించిన ఈ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతోంది. మూవీలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘ఇలా ఇలా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. పాటలో కంగన రెట్రో అండ్ మోడర్న్ లుక్లో ఆకట్టుకున్నారు. ‘తలైవి’ సినిమాను ఏప్రిల్ 23న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ అందించారు.
Latest News