బాలీవుడ్ ఆఫర్ ను దక్కించుకోన్న మరో తెలుగు స్టార్

by సూర్య | Thu, Apr 01, 2021, 12:00 PM

సౌత్ నటీ నటులు బాలీవుడ్ సినిమాల్లో నటించడం అంటే చాలా పెద్ద విషయం. చాలా అరుదుగా మాత్రమే సౌత్ నటీ నటులకు ఉత్తరాది సినిమాల్లో ఆఫర్లు వచ్చేవి. అక్కడ సినిమా చేసిన స్టార్ ను గొప్ప స్టార్ గా ప్రేక్షకులు భావించే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను మించి ఉంటున్నాయి. దాంతో బాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది సౌత్ సినిమాల్లో నటించేందుకు క్యూ కడుతున్నారు  తాజాగా తెలుగు ట్యాలెంటెడ్ హీరో 'సత్యదేవ్' కూడా హిందీ ఆఫర్ ను అది కూడా సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాలో ఆఫర్ ను దక్కించుకున్నాడు. అక్షయ్ కుమార్ నటిస్తున్న మోస్ట్ క్రేజీ మూవీ 'రామ్ సేతు' సినిమాలో సత్యదేవ్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేయడం జరిగిందట. రామాయణం ఇతివృత్తంతో కాస్త విభిన్నంగా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గకుండా ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్రను సత్య దేవ్ కు ఆఫర్ చేయడం నిజంగా ఆయనపై మేకర్స్ కు ఉన్న నమ్మకం అని అర్థం చేసుకోవచ్చు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న సత్యదేవ్ బాలీవుడ్ ఆఫర్ ను కూడా దక్కించుకోవడం అభినందనీయం. రామ్ సేతు తర్వాత సత్యదేవ్ బిజీ అయ్యే అవకాశం ఉంది. 

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM