సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న 'సారంగదరియ'

by సూర్య | Thu, Apr 01, 2021, 11:55 AM

సాయిపల్లవి, అక్కినేని నాగ చైతన్య, జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "లవ్ స్టోరీ". ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఫిబ్రవరి 28న సారంగ‌ద‌రియా అనే ఫోక్ సాంగ్ విడుద‌ల చేశారు. మంగ్లీ పాడిన సారంగద‌రియా పాట సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. పాట‌కు త‌గ్గ‌ట్టు అదిరిపోయే స్టెప్పుల‌తో సాయి ప‌ల్ల‌వి ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేయ‌డంతో ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్లకు‌పైగా వ్యూస్ దక్కించుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో అతి త‌క్కువ స‌మ‌యంలో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి పాట‌గా రికార్డు న‌మోదు చేసుకుంది. గ‌తంలో సాయి ప‌ల్ల‌వి న‌టించిన ప‌లు సినిమాల‌లోని పాట‌లు కూడా ఇంతే రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. ఇపుడు సారంగ‌ద‌రియా పాటతో ఆమె తన రికార్డులను తిరగరాశారు. కాగా, ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ పాడింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

Latest News
 
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM