హిట్టు కోసం వేచి చూస్తున్న హీరోలు వీళ్లే..

by సూర్య | Wed, Mar 31, 2021, 04:24 PM

కొందరు హీరోలు చాలా ఏళ్లుగా సరైన విజయం కోసం చూస్తున్నారు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా వాళ్లకు అదృష్టం అయితే కలిస రావడం లేదు. మరి ఫ్లాపు హీరోలెవరు.. ఎన్నాళ్లుగా వేచి చూస్తున్నారు చూద్దాం.. ఇండ‌స్ట్రీలో హీరోలు ఎలాగైనా విజయం సాధించాలని కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. దానికి ముందు చేసిన సర్దార్, కాటమరాయుడు సినిమాలు కూడా ఫ్లాపులే. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాతో ఎప్రిల్ 9న రానున్నాడు. మరో హీరో నాని 2018 నుంచి నాని టైమ్ పెద్దగా బాలేదు. దానికి ముందు వరస విజయాలతో దూసుకుపోయిన నాని.. ఆ తర్వాత మాత్రం డీలా పడిపోయాడు. గత రెండేళ్లుగా కృష్ణార్జున యుద్ధం, దేవదాస్, గ్యాంగ్ లీడర్, వి సినిమాలతో ఫ్లాపులు అందుకున్నాడు. జెర్సీ మాత్రమే హిట్ అయింది. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాతో ఎప్రిల్ 23న వస్తున్నాడు నాని.


ఇంకో హీరో అఖిల్, ఈయన న‌టించిన  సినిమాలు ‘అఖిల్’, ‘హ‌లో’ ఫ్లాప్. మొన్న ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో నెక్ట్స్ సినిమాతో అయినా విజయం అందుకోవాలని ఆరాటపడుతున్నాడు అక్కినేని వారసుడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది. హీరో  రాజ్ తరుణ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా తర్వాత ఇప్పటివరకు మ‌రో హిట్ లేదు ఈ కుర్రాడికి. దిల్ రాజు బ్యాన‌ర్‌లో వచ్చిన ఇద్ద‌రి లోకం ఒక్క‌టే కూడా డిజాస్టర్ అయింది. గతేడాది ఈయన నటించిన ఒరేయ్ బుజ్జిగా కూడా అంతగా ఆకట్టుకోలేదు. పవర్ ప్లే సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయింది.  హీరో నాగార్జున కూడా చాలా ఏళ్లుగా సరైన విజయం కోసం చూస్తున్నాడు. సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఈయనకు విజయం రాలేదు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలతో ఎప్రిల్ 2న వస్తున్నాడు నాగార్జున. 2019 బాలయ్యకు అస్సలు కలిసిరాలేదు. శాతకర్ణి తర్వాత ఈయన నటించిన , ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు బోయపాటి సినిమాపైనే ఈయన ఆశలన్నీ ఉన్నాయి. మరి ఇప్పటికైనా అదృష్టం వీళ్ళని వరిస్తుందేమో చూడాలి. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM